నమిత న్యూస్ - National / Annamayya : చెన్నై - మే 11 : ఉదయం 9.30 గంటలకు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్ ప్రొటెం ఎంవీ కరుప్పయ్య సంక్షిప్త పరిచయ ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ పెరంబూరు అసెంబ్లీ సభ్యుడిగా తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున సహా మరో తొమ్మిది మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తర్వాత డీఎంకే శాసనసభాపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కే పళనిస్వామి, డీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం కూడా ప్రమాణం చేశారు. అగ్రి కృష్ణమూర్తి, కేపీ అన్బళగన్‌తో సహా ఏఐఏడీఎంకే సభ్యులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు
Reporter
Namitha News