నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 25 ః మండల కేంద్రానికి సమీపంలో ని ప్రసిద్ధి శైవక్షేత్రంలో శనివారం తొలి ఏకాదశి ని భక్తులు పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైకాపా యూత్ జాయింట్ సెక్రెటరీ కిషోర్ కుమార్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు మహా శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గౌరమ్మ ఆలయం, భగీరథి, ఎలకతీర్థం, నిచ్చెన కొండ, వెలుగు మల్లమ్మ, వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు
Reporter
Namitha News