Monday, 27 July 2026 12:08:47 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప

Date : 20 July 2026 08:01 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 20 : ఈనెల 24వ తేదీ శుక్రవారం,మదనపల్లి నందు గల జిల్లా ఎస్టీయు కార్యాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిటి.కృష్ణప్ప పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యదర్శి జిల్లా జనరల్ బాడీ సమావేశం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. కృష్ణప్ప,సిపిఐ రాయచోటి నియోజకవర్గపు కార్యదర్శి సిద్దిగళ్ళ శ్రీనివాసులు లు మాట్లాడుతూ; ఎన్నికలకు ముందు వ్యవసాయ కూలీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం సదురు హామీలను తుంగలో తొక్కి కష్టజీవులను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్లకు,ధనవంతులకు,రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారు చౌకగా కట్టపెట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 2013 సంవత్సరం నుండి పేదలకు భూ పంపిణీ పూర్తిగా ఆగిపోయిందని, గతంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు మేరకు భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి, ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వవచ్చని,అందుకు సరిపడా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపినా కూడా ఆ సిఫార్సులను ప్రభుత్వాలు చెత్తబుట్టలో పడేసాయని విమర్శించారు.ఈ నేపథ్యంలో పేదలను సమాయత్తం చేసి మరో భూ పోరాటాలకు శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతో ఈ యొక్క సమావేశం జరుగుతున్నదని,ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బికేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు లు హాజరవుతున్నారని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే సమావేశానికి అధిక సంఖ్యలో కష్టజీవులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశపు కరపత్రాలను విడుదల చేశారు.ఈ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి కార్యక్రమంలో జగన్ మదన్ నరసింహులు మోహన రమణ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :