నమిత న్యూస్ - Telagana / మహబూబాబాద్ : మహబూబాబాద్ - ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్నేహా శబరీష్ ను మహబూబాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. స్నేహా శబరీష్ ను తాజా ఉత్తర్వులతో మహబూబాబాద్‌కు బదిలీ చేశారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా డా. శబరీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ స్నేహ శబరీష్ కు డా. శబరీష్ భర్త కావడంతో, భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉన్నత హోదాల్లో సేవలందించనున్నారు. జిల్లా పరిపాలనలో కీలకమైన, ప్రధాన హోదా లైన రెండు కలెక్టర్, ఎస్పీ, ఒకే కుటుంబానికి చెందిన అధికారుల చేతుల్లో ఉండడం అరుదైన సంఘటనగా నిలిచింది. పరిపాలన మరియు పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం మరింత మెరుగుపడే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు , శాంతిభద్రతల పరిరక్షణలో విషయం లో అధికారుల జంట సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Admin
Namitha News