నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 27 : మదనపల్లె సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఎం.బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. వెయిటింగ్ లో ఉన్న బుచ్చిరాజు ను డిఎస్పీ పావని ప్రసవ సెలువు పై వెళ్లడం తో ప్రభుత్వం బదిలీ చేసింది. మదనపల్లి డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరంమర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కలిసి మొక్కను అందజేశారు. నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలుపుతూ విధి నిర్వహణ లో అంకితభావం తో విధులు నిర్వహించాలని సూచించారు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు ప్రధానంగా మహిళల భద్రత, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా పని చేయాలని సూచించారు
Reporter
Namitha News