Monday, 27 July 2026 06:46:52 PM
# కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు

భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి

రెన్యూవల్ చేసుకోవాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ హుస్సేన్

Date : 27 July 2026 01:30 PM Views : 12

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నందు 2009 సంవత్సరం నుండి గుర్తింపు కార్డులు పొందిన భవననిర్మాణ కార్మికులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని మదనపల్లె అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ హుస్సేన్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం బి.కొత్తకోట పీటియం రోడ్ నందు గల రాజా ఫంక్షన్ హాల్ నందు భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించి కొంతమంది కార్డులు రెన్యూవల్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ;ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు సహజ మరణానికి 60,000/, దహన క్రియలకు 20 వేల రూపాయలు,ఇద్దరు ఆడబిడ్డల వివాహాలకు ఒక్కొక్కరికి 20,000 రులు, అలాగే ఒక్కొక్క ఆడబిడ్డకు రెండేసి కాన్పులు చొప్పున ప్రసూతి సహాయం క్రిందన 20వేల రూపాయలు, అలాగే కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి శిక్షణ కాలంలో రోజుకు 300 రూపాయల ఆర్థిక సహాయం కల్పించాలని గత మార్చి నెల ఒకటో తారీఖు నుండి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకున్నదని ఆయన వివరించారు.కాబట్టి సంక్షేమ బోర్డు నందు తమ పేర్లను నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందిన కార్మికులందరూ తమ కార్డులను రెన్యువల్స్ చేసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని,అలాగే కార్డులు పొందని కార్మికులు సభ్యులుగా నమోదు చేయించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సిబ్బంది శంకర్, బి. కొత్తకోట హార్డ్ వేర్ యూనియన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్మిక నాయకులు ఎస్. మనోహర్ రెడ్డి,జి.రఘునాథ్,ఎం.అష్రఫ్అల్లి,యస్.తంబయ్యశెట్టి,డి.పెన్నయ్య,ఎస్.జవహార్ బాబు,బి.వెంకటరెడ్డి,బి. చెన్నకేశవులు,అంజి, రమేష్,నాగరాజు,రెడ్డి మరియు భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :