నమిత న్యూస్ - Devotional / Annamayya : నవంబర్ 9: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదాన సేవలు,ఆకలితో ఉన్న వారి కోసం మదనపల్లి,గుర్రంకొండ ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు,అమ్మాయిల కోసం సానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు,క్యాన్సర్ భాదితులకు హెయిర్ డోనేషన్,ఆఖరి చూపు కోసం ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ బాక్స్ వంటి సేవా కార్యక్రమాలతో పలువురికి ఆదర్శంగా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ గత 11ఏళ్ల కాలం నుండి హిందు, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మత సామరస్యం తో సోదర భావాన్ని పెంపొందిస్తూ పవిత్ర అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం జ్ఞానోదయా హై స్కూల్ నందు అయ్యప్పస్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం మొదలు అయ్యప్ప స్వామి చిత్ర పటానికి పూజ నిర్వహించి, హారతి ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ బృందం అన్నదాన వితరణ చేశారు. హెల్పింగ్ మైండ్స్ సేవలు మరువలేనివని సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని అయ్యప్పస్వామి భక్తులు కొనియాడారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఆనవాయితీగా ప్రతి ఏటా సోదర భావం తో, మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఖాదర్ ఖాన్,సునీల్, హనీఫ్,సమీర్,కమ్మల ఆనంద్,నవీన్, సాయి దీపక్,రాహుల్,అమీన్,సైస వలి, ఉమర్, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News