Sunday, 26 July 2026 11:31:30 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహల ప్రతిష్ట

Date : 27 February 2026 10:16 PM Views : 363

నమిత న్యూస్ - Devotional / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 27 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ లో శుక్రవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, కవితమ్మల ఆధ్వర్యంలో ముగ్గురు దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం ఎమ్మెల్యే దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహా శివునికి అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే దంపతులు తొలుత వెలుగు మల్లమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అనంతరం కొండకింద మదాతం బావి వద్ద వినాయక ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో స్వామివారుల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు సదుం కు చెందిన ప్రధాన అర్చకులు రఘు, వేణు స్వాముల అర్చకత్వంలో జనవాహిని మధ్య కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు రఘు, వేణు స్వాములు హిందూ ధర్మ ఆచారాలు, ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలకు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, నవగ్రహాల పూజ, వాస్తు పూజ,జలాధివాసం,8 దాన్యాధివాసం, హోమం, యంత్ర ప్రతిష్ట అనంతరం దేవత మూర్తుల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నియమ నిష్టలతో నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప, దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు వందలాదిగా భక్తులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాలు కనులారా వీక్షించి ఆస్వాదించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :