నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధిలో పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కొనియాడిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- PPP విధానం పేదలకు వైద్యం దూరం... కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం -- మదనపల్లె మున్సిపాలిటీ 4, 21 వార్డులలో కోటి సంతకాల రచ్చబండలో నిస్సార్ అహమ్మద్... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతనిచ్చి సంక్షేమ, అభివృద్ధి పధకాలు తెచ్చారని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. బుధవారం మదనపల్లె మున్సిపాలిటీ 4, 21 వార్డులలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు అధికంగా వున్నారు, కాబట్టి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపారని, దీనికి కారణం మీరే అని, అందరూ ఐక్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం సమాజానికి చేయూత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలు అందించడం జరిగిందని వివరించారు. ముస్లిం యువత విద్య పై దృష్టి పెట్టాలని తద్వారా సమాజంలో గౌరవం పెరగడం, చెడు వ్యసనానికి దూరంగా వుంటారని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ద్వారా పేదలకు వైద్యం అందక పోవడం తోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్యం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన PPP విధానానికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ సంతకం చేసి తమ వ్యతిరేకత వెల్లిబుచ్చాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారని వివరించారు. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలలను రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేదల పిల్లలు డాక్టర్ల అవుతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన కారణంగా సేవలు చాలా మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ PPP విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ముడుపుల కోసమే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి తేవడమన్నది ఒక చరిత్ర అని, అది జగన్మోహన్ రెడ్డి సృష్ఠించాడన్నారు. అవి పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కి పేరుప్రతిష్ఠలు వస్తాయో అన్న కుతంత్రంతోనే మెడికల్ కళాశాలలను పీపీపీ అంటూ ప్రైవేటు పరం చేసేస్తున్నారన్నారు. సంపద సృష్ఠి అంటే వేలల్లో ఖర్చుపెట్టి చదివే విద్యార్థులు లక్షల్లో ఖర్చుపెట్టి చదివేలా చెయ్యడమేనా అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసిపి చేస్తున్న పోరాటంలో ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షమీమ్ అస్లాం, వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్-ఆజం, ఖాజా , రఫీ, రాజేష్, సుధాకర్, రమేష్, ఎన్. ఇర్ఫాన్ ఖాన్, ఇర్ఫాన్ షేక్, యూనస్, శ్రీనివాసులు, ఆంజనేయులు, మహేష్, మల్లికార్జున, ఎన్. నవాజ్ పాల్గొన్నారు.
Reporter
Namitha News