Monday, 27 July 2026 04:39:50 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సోన మసూరి బియ్యం రకానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ కు దరఖాస్తు

Date : 22 March 2026 04:21 PM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు అనంతపురము సోన మసూరి బియ్యం రకానికి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన తేలిపారు. అనంతపురము జిల్లాకు ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు—తక్కువ వర్షపాతం కలిగిన అధిక ఎండ ప్రాంత వాతావరణం, ఎర్రటి ఇసుక మట్టి మరియు తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల నేలలు, అధిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇక్కడ పండే సోన మసూరి బియ్యానికి ప్రత్యేకమైన నాణ్యత లక్షణాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ బియ్యం మెరుస్తున్న బంగారు-పసుపు రంగు, గట్టి గింజ నిర్మాణం, అద్భుతమైన వంట నాణ్యత మరియు మంచి వాసనతో ప్రత్యేక గుర్తింపు పొందింది అని అన్నారు. ఈ ప్రత్యేకతను రక్షించేందుకు అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి GI దరఖాస్తును MITS-IPFC సంస్థ సాంకేతిక, విధానపరమైన సహాయాన్ని అందించింది. జి.ఐ ట్యాగ్ గుర్తింపు లభించడం ద్వారా ఉత్పత్తి పేరును దుర్వినియోగం కాకుండా కాపాడటంతో పాటు రైతులకు న్యాయమైన ధరలు, మార్కెట్ నమ్మకం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య విలువ పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ రిజిస్ట్రేషన్‌కు దోహదపడిన అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ, అనంతపూర్, మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ వారి ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్ పి.శివయ్య మరియు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: