నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: హిందువులకు ఎంతో ముఖ్యమైన,పవిత్రమైన తిరుమలలో కల్తీ నెయ్యికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లి పట్టణంలోని, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో కల్తీ నెయ్యి విషయమై మాట్లాడారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నారు. ఇంతటి పవిత్రమైన ఆలయంలో భక్తులు తినే లడ్డులో గత వైసిపి ప్రభుత్వం కల్తీ నెయ్యి సరఫరా చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.రూ. 150 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందులో ప్రమేయమున్న ఏ ఒక్కరిని వదలకూడదు అని, అరెస్టు చేసి జైలుకు పంపాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను కాపాడుతున్నారని, భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో భక్తులకు పెట్టే భోజనాలు, లడ్డు, పరిశుభ్రత అద్భుతంగా ఉన్నాయని గణి కొనియాడారు.
Reporter
Namitha News