నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 : టిడిపి సీనియర్ మైనార్టీ నేత పీర్ల మాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. శుక్రవారం పీర్ల మాబు భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించి మండలంలో కరుడుగట్టిన టిడిపి నాయకుడు మాబు లేని లోటు ఎవరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి భవిష్యత్తులో వారికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఓదార్పులో టిడిపి నాయకులు తులసీధర్ నాయుడు, డేరంగుల చంద్రమోహన్, రామచంద్ర, ఆదిరెడ్డి, చిన్న రెడ్డప్ప,శివరాం, రామలింగారెడ్డి, సామి రెడ్డి, నిజాముద్దీన్, జయరాం రెడ్డి, శ్రీనివాసరెడ్డి,మదనమోహన్ రెడ్డి, లోకేష్ రెడ్డి, సలాది రాజశేఖర్, చంద్ర నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News