నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 07 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఇంటర్నల్ క్వాలిటీ అస్సురెన్సు సెల్ (IQAC) విభాగం వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR), చెన్నై వారి సహకారంతో “బోధన మరియు అభ్యాసంలో కృత్రిమ మేధస్సు యొక్క వినియోగం” అనే అంశంపై ఐదు రోజుల వృత్తిపర అభివృద్ధి కార్యక్రమంను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పి. మల్లిగా, ప్రొఫెసర్ & హెడ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగం మరియు ఎడ్యుకేషనల్ మీడియా అండ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి శుభ యెన్.ఐ.టి.టి.ఆర్, చెన్నై పాల్గొన్నారు
కార్యక్రమంలో డాక్టర్ మల్లిగా మాట్లాడుతూ ఉన్నత విద్యలో కృత్రిమ మేధ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరిస్తూ, బోధన-అభ్యసన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు అధ్యాపకులు ఏ.ఐ ఆధారిత సాధనాలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠ్య ప్రణాళిక రూపకల్పన మరియు పరిశోధనలో ఏ .ఐ సాంకేతికతలను అనుసంధానం చేయడం అవసరమని తెలిపారు. అభ్యాసన వనరుల అభివృద్ధి, డిజిటల్ కంటెంట్ సృష్టి మరియు వ్యక్తిగతీకరించిన అభ్యసనంలో ఏ.ఐ పాత్రను వివరించారు. ఏ ఐ ఆధారిత సాధనాలను ఉపయోగించి అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్స్ ప్రతి విద్యార్థి నేర్చుకునే వేగం మరియు సామర్థ్యానికి అనుగుణంగా పాఠ్యాంశాన్ని మార్చుతాయని అన్నారు. కంటెంట్ క్రియేషన్ టూల్స్ ద్వారా ప్రెజెంటేషన్స్, వీడియోలు, క్విజ్‌లు సులభంగా రూపొందించవచ్చు. వర్చువల్ క్లాస్‌రూమ్స్ ద్వారా ఆన్లైన్ బోధనను సమర్థవంతంగా నిర్వహించవచ్చు అని అన్నారు. ప్లేజరిజం చెకర్స్ కాపీ తనిఖీ సాధనాలు విద్యార్థుల అసైన్‌మెంట్‌లలో కాపీ కంటెంట్‌ను గుర్తించి, డేటా అనాలిటిక్స్ టూల్స్ విద్యార్థుల పనితీరును విశ్లేషించి బోధనను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఏ ఐ సాధనాల వినియోగంతో బోధన మరింత సమర్థవంతంగా, వేగంగా మరియు విద్యార్థి ఆధారితంగా రూపాంతరం చెందుతుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ సి శుభ మాట్లాడుతూ విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు అధ్యాపకులకు కొత్త అవకాశాలను అందించడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత ఉన్నతంగా తీసుకెళ్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ కే సతీష్, విభాగాధిపతులు, కోఆర్డినేటర్ డాక్టర్ అనురాధ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు
Reporter
Namitha News