నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 31 ః మండలంలోని కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మాన్యం భూములను కౌలుకు టెండర్ రహిత వేలం పాటలు నిర్వహించనున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. ఆలయానికి చెందిన 9.49.1/2 ఎకరాల భూమిని 2025 డిసెంబరు నుండి 2028 నవంబర్ వరకు మూడేళ్లపాటు వ్యవసాయానికి మాత్రమే కౌలుకు టెండర్ రహిత వేలం పాటలు ఫిబ్రవరి 3 కోసువారిపల్లి ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వేలం పాటదారులు పాల్గొనాలని తాసిల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.
Reporter
Namitha News