నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 22 ః తంబళ్లపల్లె మండలంలో శుక్రవారం గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు మన ఐటీ మంత్రి యువ కెరటం నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి టిడిపి కుటుంబ సభ్యులు కలిసి రావాలని రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర పిలుపునిచ్చారు. పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆదేశాల మేరకు గ్రామాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలు పక్కన పెట్టి ప్రజలతో మమేకమై కలసికట్టుగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను విజయవంతంగా నిర్వహించి మనలో ఐకమత్యాన్ని చాటాలని తెలిపారు. జన్మదిన కార్యక్రమాలలో ఆర్భాటాలు లేకుండా విద్యార్థుల సౌకర్యాలు, అన్నదానం, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి మన పార్టీ క్రమశిక్షణకు మారుపేరని నిరూపించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
Reporter
Namitha News