Sunday, 26 July 2026 05:35:21 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సియం చంద్రబాబు యాదమరి పర్యటన - చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ట్రయల్ రన్

సియం పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా, ట్రాఫిక్ మరియు బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన

Date : 22 May 2026 07:51 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : యాదమరి - మే 22 : యాదమరి మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనుటకు రేపు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఈ రోజు కాన్వాయ్ విధులలో పాల్గొనే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS దిశానిర్దేశం చేశారు.చిన్నారెడ్డిపల్లి బస్ స్టాప్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం, హెల్త్ కేర్ సెంటర్ వరకు ట్రయల్ రన్ నిర్వహించి, కాన్వాయ్ సిబ్బంది యొక్క విధులు, భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.కాన్వాయ్ లో విధులు నిర్వహించే ప్రతి డ్రైవర్, రోప్ పార్టీ, పైలట్ వాహన సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డ్రైవర్లు వాహనాల మధ్య తగిన దూరం పాటిస్తూ, నిర్ణీత వేగ పరిమితిలోనే ప్రయాణించాలని తెలిపారు.పర్యటన మార్గమంతా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణించే సమయంలో సాధారణ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు.సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్య కూడళ్లు, పార్కింగ్ ప్రదేశాలు మరియు రహదారి వెంట సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే ఉన్నతాధికారులకు మరియు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు.అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫైర్ సర్వీసులు, అంబులెన్స్‌లు, మెడికల్ టీములు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు కార్యక్రమ ప్రాంగణంలో పోలీసు సిబ్బందికి సహకరించి, భద్రతా తనిఖీల అనంతరం మాత్రమే అనుమతించబడతారని పేర్కొన్నారు. ఏవైనా అనూహ్య పరిస్థితులు ఎదురైతే వెంటనే వాకీటాకీ ద్వారా సమాచారం ఇవ్వాలని, సి.ఎం. గారు ఏ ప్రదేశంలోనైనా వాహనాన్ని ఆపినట్లయితే రోప్ పార్టీ వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని భద్రతా పరంగా కవర్ చేయాలని సూచించారు. రహదారిని పూర్తిగా క్లియర్ చేసి, ప్రజలను నియంత్రణలో ఉంచాలని తెలిపారు.పైలట్ వాహనం ముందుగా మార్గాన్ని పరిశీలించి, ప్రమాదకర పరిస్థితులు ఉంటే వెంటనే కాన్వాయ్‌ను అప్రమత్తం చేయాలని తెలిపారు. పైలట్ వాహనం ఇచ్చే సంకేతాలను ఇతర వాహనాలు తప్పనిసరిగా గమనించి అనుసరించాలని ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసే వరకు ఎవరూ విధుల పట్ల అలసత్వం వహించకుండా,తమకు కేటాయించిన బాధ్యతలను అప్రమత్తంగా నిర్వర్తించి పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు జరగకుండా చూడాలని ఎస్పీ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ASP డా. తరుణ్ పహ్వా, IPS, అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ శ్రీ దేవదాస్, చిత్తూరు SDPO శ్రీ జె. వెంకటనారాయణ, పోలీస్ అధికారులు, ఫైర్ ఆఫీసర్, ఎమ్మార్వో, ఎంపీడీవో మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: