నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి . కొత్తకోట - మే 23 : బి.కొత్తకోట గ్రామంలోని ఉమ్మడి భూమిలో ఉన్న పెద్దల సమాధులు, పాత ఇంటి అవశేషాలు, పలవృక్షాలు, బావి, నీటి తొట్టెలను జేసీబీలతో ధ్వంసం చేయడం దారుణం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం, బి.కొత్తకోట గ్రామ పరిధిలో ఉమ్మడి హక్కులతో ఉన్న భూమిలో పెద్దల నాలుగు సమాధులు, పాత ఇంటి గోడలు/మిద్దె, పలవృక్షాలు, బావి, నీటి తొట్టెలను జేసీబీలతో ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన, చట్టవిరుద్ధమైన చర్య అని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి సలీం భాషా బాధితులు శంకరప్ప,తీవ్రంగా ఖండించారు. శనివారం బాదిత కుటుంబ సభ్యులతో కలిసి బి. కొత్తకోట మండల తహశీల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సలీం భాషా,శంకరప్ప మాట్లాడుతూ 1967 సంవత్సరంలో తిపిరి రామప్ప నుంచి రెడ్డివారి వెంకట్రాయప్ప కుమారులు నలుగురు ఉమ్మడిగా ఉన్న భూమిలో కేవలం 1/6 వంతు భూమిని మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ, మొత్తం ఉమ్మడి భూమిపై తమకే పూర్తి హక్కు ఉన్నట్టుగా వ్యవహరిస్తూ, ఇతర భాగస్వాముల హక్కులను కాలరాస్తూ అక్రమంగా పెద్దల సమాధులు, పాత ఇంటి గుర్తులు, వృక్షాలు, నీటి వనరులను ధ్వంసం చేయడం అమానుషమని మండిపడ్డారు. పెద్దల సమాధులు అంటే కేవలం మట్టి కట్టలు కావు, అవి కుటుంబాల చరిత్ర, భావోద్వేగాలు, పూర్వీకుల జ్ఞాపకాలు. వాటిని జేసీబీలతో కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, గ్రామీణ సంప్రదాయాలపై దాడి చేసినట్టేనని అన్నారు. ఉమ్మడి భూమిలో హద్దులు నిర్ణయించకుండా, ఇతర భాగస్వాముల అనుమతి లేకుండా ఏకపక్షంగా వ్యవహరించడం చట్టపరంగా కూడా తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, జేసీబీలతో ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూమిలో మరింత అక్రమ జోక్యాలు జరగకుండా రెవెన్యూ మరియు పోలీసు శాఖల ద్వారా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే, ఉమ్మడి భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, బలవంతపు ధ్వంసాలు, పేద ప్రజల వారసత్వ హక్కులపై దాడులను అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బాదిత కుటుంబ సభ్యులు తిపిరి శంకరప్ప, భార్య పార్వతమ్మ, వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News