Sunday, 26 July 2026 08:25:49 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

డెంగ్యూ వ్యాధి పై అవగాహన కార్యక్రమం

డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు

Date : 01 July 2026 09:04 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 01 : పుంగనూరు సబ్ యూనిట్ పరిధిలోని తూర్పుమొగసాల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, BD కాలనీ-1 సచివాలయం పరిధిలో గల BD కాలనీ నందు UPHC తూర్పుమొగసాల వైద్యాధికారి Dr.జయంత్ సాయి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం మరియు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. . ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మాట్లాడుతూ ఈ జులై నెల ఒకటవ తారీఖు నుండి 31 తారీఖు వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవములు జరుగుచున్నవి. డెంగ్యూ అనేది ' *ఏడిస్* ' (Aedes) దోమలు కుట్టడం వల్ల వచ్చే ప్రమాదకర వైరల్ జ్వరం. దీనివల్ల తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ప్లేట్‌లెట్ల (రక్తకణాలు) సంఖ్య పడిపోవడం జరుగుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని సులభంగా నివారించవచ్చును. డెంగ్యూ జ్వరం గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. *డెంగ్యూ లక్షణాలు* దోమ కుట్టిన 4 నుండి 10 రోజులలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి: ఆకస్మికంగా వచ్చే అధిక జ్వరం (104-105 డిగ్రీల వరకు), తీవ్రమైన తలనొప్పి మరియు కళ్ళ వెనుక నొప్పి, కీళ్ళు మరియు కండరాలలో భరించలేని నొప్పులు, (ఎముకలు విరిగినట్లు అనిపించడం), వాంతులు, వికారం మరియు శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం. *దోమలు ఎక్కడ పెరుగుతాయి?* ఈ దోమలు మురికి నీటిలో కాకుండా, స్వచ్ఛమైన నిల్వ ఉన్న నీటిలో మాత్రమే పెరుగుతాయి. కూలర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, మరియు కుండీలలో నిల్వ ఉండే నీరు వీటి నివాసాలు. * *తీసుకోవాల్సిన - జాగ్రత్తలునీరు** నిల్వ ఉండకుండా చూసుకోవడం: ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండనివ్వకండి. *దోమల నివారణ* : నిద్రపోయేటప్పుడు దోమల తెరలను ఉపయోగించండి. పూర్తి చేతులు, కాళ్ళు కప్పే దుస్తులు ధరించండి. దోమల మందులు: దోమలు కుట్టకుండా ఉండే క్రీములు లేదా లోషన్లు వాడండి. *చికిత్స మరియు ఆహారం* జ్వరం రాగానే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోండి. డెంగ్యూ సమయంలో శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. కాబట్టి, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మరియు మంచినీరు పుష్కలంగా త్రాగాలి. బొప్పాయి ఆకు రసం, కివీ పండు, మరియు దానిమ్మ తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచుకోవచ్చునని తెలిపారు. అలాగే మలేరియా, చికున్ గున్యా, మెదడువాపు వ్యాధి, బోధకాలు వ్యాధి వంటి వ్యాధుల గురించి మరియు నివారణ చర్యలు గురించి ప్రజలకు ఆరోగ్య విద్యను బోధించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి Dr. జయంత్ సాయి గారు, పుంగనూరు సబ్ యూనిట్ అధికారి G. గంగయ్య గారు, బహుళార్థ సాధక ఆరోగ్య సహాయకులు P. సోమశేఖరాచారి, ANM లు వెంకటలక్ష్మి, భారతి, ఆశా కార్యకర్త గౌతమి మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :