నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా సుగవాసి ఎన్నికైన సందర్బంగా రామసముద్రం మండలం కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ, టిడిపి ఎస్సి సెల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ శివశంకర టిడిపి నాయకులు డాక్టర్ జి. శివకుమార్ రెడ్డి సోమవారం వాల్మీకి వీధిలో సమావేశం నిర్వహించారు. వీరు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సుగవాసి కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. మండలాన్ని అభివృద్ధి పథం నడపాలని, మదనపల్లి నుండి చెంబకూరు డబుల్ రోడ్డు కు నిధులు మంజూరు చేయాలని మండలానికి హంద్రీ జలాలు తీసుకురావాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు శివశంకర, డాక్టర్ శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News