Monday, 27 July 2026 04:18:56 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

లక్ పతి దీదీ యోజన పథకం లో 2వేల పాడి ఆవుల రుణాలు - ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సుమలత

Date : 19 February 2026 10:24 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 ః ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ద్వారా వెయ్యి, శ్రీనిధి పాల డైరీ లబ్ధిదారులకు వెయ్యి మొత్తం 2వేల పాడి ఆవుల రుణాలు మంజూరు కు శ్రీకారం చుడుతున్నట్లు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సుమలత తెలిపారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో మహిళ సంఘాలు, సంఘమిత్రలు, మహిళా సమాఖ్య సభ్యులతో సమీక్షించారు. తంబళ్లపల్లె, కోసువారిపల్లి ఇండియన్ బ్యాంక్ ల ద్వారా రికార్డ్ స్థాయిలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, పంట రుణాలు పంపిణీ జరిగినట్లు చెప్పారు. దీంతోపాటు గృహాలు, వెహికల్, ప్లాట్లు,తనఖా మార్ట్ గేజ్ తో రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. పీఎం స్వనిధి, పి ఎం జి ఎస్ వై, పీఎం ఈజిపి, పీఎం విశ్వకర్మ, ముద్ర హ్యాండ్లూమ్స్ రుణాల పంపిణీ, పీఎం డిడి కేవై, పీఎం సూర్యగర్ మ మఫ్ట్ బిజిలి యోజన, పై చొరవ చూపిస్తున్నట్టు చెప్పారు. బ్యాంకులకు సంబంధించిన రుణాల రికవరీ, సంఘాల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. బ్యాంకులకు సంబంధించి సైబర్ నేరాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎస్ ఎస్ జి రుణాల పంపిణీలో తంబళ్లపల్లె ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఏపిఎం గంగాధర్, సీసీలు, సంఘ మిత్రలు, వివో లీడర్లల పనితీరుపై జోనల్ మేనేజర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఏపీఎంను దృశ్యాలువతో బ్యాంక్ రీజినల్ మేనేజర్, మేనేజర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రఘునాథ, మేనేజర్లు,ప్రవీణ్ కుమార్, నాగరాజు, ఏపీఎం గంగాధర్, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామ లక్ష్మమ్మ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మహిళా సంఘాలు, సంఘమిత్రలు, వివో సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :