నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పది రీ-వెరిఫికేషన్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థిని వి.రిషిత 600 మార్కులకుగాను 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచాడని అభినందనలు తెలిపారు. గురువారం నారాయణ విద్యాసంస్థల డిజిఎం కొండలరావు విద్యార్థిని రిషితకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాలు ఏవైనా నారాయణ విద్యార్థుల ప్రభంజనం సృష్టిస్తున్నారని, మా విద్యాసంస్థలు అవలంబిస్తున్న విద్యా ప్రమాణాలే ఈ ఫలితాలకు నిదర్శనమని వెల్లడించారు. మదనపల్లి లోని నారాయణ పాఠశాలలో ఆవరణంలో ఏజీఎం ఫణికుమార్,ప్రిన్సిపాల్ షఫీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విజయోత్సవ సంబరాల జరుపుకున్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేలో విడుదలైన పదవ తరగతి 2026 ఫలితాల్లో రిషిత 596 మార్కులు సాధించిందని,అయితే సదరు విద్యార్థిని పూర్తి విశ్వాసంతో రీ-వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోగా మరో రెండు మార్కులు సాధించి రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ రెడ్డి శేఖర్, ఏఓ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News