Sunday, 26 July 2026 01:33:36 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు

Date : 05 June 2026 02:44 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు : మదనపల్లి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే నిబంధన పేరుతో పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడం అత్యంత అన్యాయమని, తొలగించిన కార్మికులను వెంటనే యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆసుపత్రి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు అందిస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఉపాధి అవకాశాల కొరత నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే కారణంతో విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో కార్మికులపై ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గజపతి, పారిశుద్ధ్య కార్మికులు లక్ష్మి పార్వతి, లలిత, రాజేశ్వరి, గుంటమ్మ, కృష్ణవేణి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :