నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకిపురం - మే 10 : అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ పోస్టు మ్యాన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి పోలీసుల కథనం.. వాల్మీకిపురం నుండి చింతపర్తికి వెళుతున్న పోస్ట్ మాన్ ప్రభాకర్ ను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో పోస్ట్ మ్యాన్ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వాల్మీకిపురం ఎస్ఐ తిప్పేస్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు
Reporter
Namitha News