నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 05 : అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె గ్రామ పంచాయతీలో స్వమిత్వ గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు . గ్రామ సభకు డిప్యూటి ఎంపిడిఓ గపూర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వామిత్వ పథకం ద్వారా గ్రామ ఖాతాలో గృహ హక్కులు కల్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్థులకు క్లుప్తంగా వివరించారు.ఈకార్యక్రమంలో గ్రామస్థానిక నాయకులు కె. పెద్ధిరెడ్డి, వి. రెడ్డెప్పరెడ్డి, బి. నారాయణ, ఆర్. సోమశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భానుమూర్తి సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News