Monday, 27 July 2026 02:11:54 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లాను వ్యర్థ రహితంగా రూపొందించాలి

Date : 28 March 2026 10:30 PM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత (జీరో వేస్ట్) కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు

శనివారం మదనపల్లి పట్టణంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. ఈ నెలకు “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా విద్యాసంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని సరైన విధంగా వేరు చేసి నిర్వహించకపోతే పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, హానికర వ్యర్థాలను వేర్వేరు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, క్యాంటీన్ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, ప్రతి సంస్థ తమకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా నగదు లేదా వస్తువులు అందించే విధానం అమల్లో ఉందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. పర్యాటక ప్రదేశాలు, అడవుల్లో చెత్త పారవేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా శుభ్రతను పాటించాలని సూచించారు. శుభ్రత ఒక రోజు కార్యక్రమం కాకుండా రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. విద్యార్థులు ఈ శుభ్రత సందేశాన్ని తమ కుటుంబాలకు, సమాజానికి తీసుకెళ్లి ప్రతి ఇంటిని కూడా జీరో వేస్ట్ కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, డీఎల్‌డీఓ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీవో తాజ్ మసూద్, డిప్యూటీ ఎంపీడీవో భారతి, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :