Sunday, 26 July 2026 12:26:22 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విద్యార్థుల భద్రతే లక్ష్యం: జిల్లావ్యాప్తంగా ‘శక్తి’ టీమ్స్ అవగాహన సదస్సులు

Date : 31 January 2026 08:01 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు విద్యార్థులలో సామాజిక అంశాలపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా జిల్లావ్యాప్తంగా 'శక్తి' బృందాలు విస్తృత కార్యక్రమాలను నిర్వహించాయి. నేటి సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలల్లో శక్తి టీమ్ సభ్యులు అవగాహన కల్పించారు. పోక్సో చట్టం: బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధక చట్టం పట్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విపులంగా వివరించారు. *గుడ్ టచ్ & బ్యాడ్ టచ్:* చిన్నపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలో, అపరిచితుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో ప్రాక్టికల్‌గా వివరించారు. *బాల్య వివాహాల నిరోధం:* బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, అటువంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. *సైబర్ నేరాలు:* సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండే మార్గాలను తెలియజేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన: గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థిని విద్యార్థులకు ఎస్పీ గారి సందేశం "విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుంది. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణకు ‘శక్తి’ టీమ్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటాయి." అని పేర్కొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :