Sunday, 26 July 2026 03:49:35 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పెద్దేరు ప్రాజెక్టుకు నిధుల మంజూరులో పంగనామాలు

చెరువుల అభివృద్ధిపై చిన్న చూపు-అభివృద్ధి చేయలేని పదవులు మాకెందుకు.. !

Date : 14 May 2026 09:25 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 14 : రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులలో తంబళ్లపల్లె మండలానికి తీవ్ర అన్యాయం జరిగినట్లు పెద్దేరు ప్రాజెక్ట్ చైర్మన్ కొట్టాల శివకుమార్ తోపాటు చెరువుల సంఘం అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి 397 కోట్లు మంజూరు కాగా తంబళ్లపల్లె నియోజకవర్గానికి కోటి మంజూరు అయింది. బి.కొత్తకోట మండలంలోని చెరువులకు రూ24.68 లక్షలు, కురబలకోట కు రూ 25.30 లక్షలు, పెద్దమండెం కు రూ 21.60 లక్షలు, తంబళ్లపల్లెకు రూ 11.40 లక్షలు, మొలకలచెరువుకు రూ 6 లక్షలు మంజూరయ్యాయి. చెరువులకు నిధుల మంజూరులో వివక్ష చూపారని పలు మండలాల చెరువు సంఘం అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురబలకోట మండలంలో మూడు చెరువులే ఉంటే నాయన చెరువు కు రూ9 లక్షలు, పాకాల మంద చెరువుకు రూ 8.30 లక్షలు, రంగమ్మ చెరువు రూ8 లక్షలు మంజూరు అయ్యాయి. ములకలచెరువు మండలంలో 8 చెరువులకు గాను సోంపల్లి పెద్ద చెరువుకు ఆరు లక్షలు మాత్రమే కేటాయించారు. తంబళ్లపల్లె మండలంలో జిల్లాలోనే ప్రాధాన్యం గల నాలుగు వేల ఎకరాల సాగు కలిగిన పెద్దేరుప్రాజెక్టు కు ఒక్క పైసా విదల్చకపోగా మరో 11చెరువులకు గాను బయమ్మ చెరువుకు రూ5.50 లక్షలు, గుండ్లపల్లి చెరువుకు రూ 5.90 లక్షలు మంజూరు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. పెద్ద తిప్ప సముద్రం మండలంలో ఏడు చెరువులకు గాను రంగసముద్రం చెరువుకు రూ 5.22 లక్షలు, కందుకూరు వ్యాసరయ సముద్రం కు రూ 5.80 లక్షలు మంజూరు చేశారు. బి కొత్తకోటలో ఐదు చెరువులతో గాను కొమ్మ చెన్నయ్య చెరువుకు రూ8.09 లక్షలు, బీరంగి నాగల చెరువు కు రూ8.02 లక్షలు, బడి కాయల పల్లి పెద్ద చెరువుకు రూ 8.57 లక్షలు మంజూరు చేశారు. పెద్దమండెం మండలంలో ఎనిమిది చెరువులకు గాను లంప వంక చెరువు కు రూ7.10 లక్షలు, గోరిమిల్ల కుంట కు రూ 7.30 లక్షలు, తిప్పిరెడ్డి చెరువు కు రూ 7.20 లక్షలు మంజూరయ్యాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం లో చెరువులకు మంజూరైన నిధుల విషయమై పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొట్టాల శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పలు చెరువులు మరమ్మతులకు నోచుకోక పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని నిధుల మంజూరులో పారదర్శకత లోపించిందని విమర్శించారు. పెద్దేరు ప్రాజెక్టులో రోడ్డు, పార్కు దుస్థితి, కాలువల దుస్థితి, శిథిలావస్థలోని క్వార్టర్స్ ఇంకా పలు సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా ఒక్క పైసా కేటాయించకపోవడం విచారకరమని నిధులు లేక ఆయకట్టు రైతుల వద్ద చివాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని అభివృద్ధి చేయలేని ఈ పదవులు మాకెందుకని ఆవేదన వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: