నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టౌన్ : తన పడకగదిలో జరిగే వ్యక్తిగత విషయాలను చిత్రీకరించేలా సీసీ కెమెరా ఏర్పాటు చేశారని, ఆ వీడియోలను సెల్‌ఫోన్ల ద్వారా ఇతరులకు పంపిస్తూ పరువు తీస్తున్నారని ఓ బాధితుడు జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. మదనపల్లె మండలం పోతబోలు గ్రామంలోని భూమకంవారిపల్లికి చెందిన భాస్కర్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో హాజరై వినతిపత్రం అందజేశాడు. తన ప్రత్యర్థులైన గంగులప్ప, జయలక్ష్మి తన నివాసంలోని పడకగదిని లక్ష్యంగా చేసుకుని సీసీ కెమెరా అమర్చారని, అందులో రికార్డైన దృశ్యాలను సెల్‌ఫోన్ల ద్వారా బహిర్గతం చేస్తూ తన గోప్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా, తన భార్యతో ఉన్న వ్యక్తిగత క్షణాలను కూడా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి గ్రామంలో అవమానానికి గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరాడు
Reporter
Namitha News