Monday, 27 July 2026 03:11:12 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పోలీసుల విధుల్లో క్రమశిక్షణ,ఫిట్ నెస్, నైపుణ్యం ప్రజలకు భరోసా - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఏఆర్ సిబ్బందికి రెండు వారాల 'మొబిలైజేషన్' శిక్షణ ప్రారంభం

Date : 27 January 2026 08:24 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 27: పోలీసు వృత్తి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత అని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పేర్కొన్నారు. మంగళవారం రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో సాయుధ పోలీసు బలగాల (AR) కోసం ఏర్పాటు చేసిన రెండు వారాల వార్షిక 'మొబిలైజేషన్' శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పోలీసులు తమ విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, సాంకేతికతను మరియు వృత్తి నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఇతర వృత్తుల కంటే పోలీసు వృత్తి భిన్నమైనదని, ప్రజల ఆశలను వమ్ము చేయకుండా అత్యంత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఏటా నిర్వహించే ఈ శిక్షణ ద్వారా సిబ్బంది ఫిజికల్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తిరిగి గుర్తుచేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శిక్షణతో పాటు సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ గారు వెల్లడించారు. బి.డి టీమ్, పి.ఎస్.ఓలు మరియు డ్రైవర్లు తమ నైపుణ్యాలను మరింత పదును పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ రెండు వారాల పాటు ఏఆర్ సిబ్బందికి ఈ క్రింది అంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు.. స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్ మరియు ఆర్మ్స్ డ్రిల్. గార్డ్ డ్యూటీ విధులు, 303 వెపన్, SLR వెపన్, AK-47 వెపన్, పిస్టల్, గ్రెనేడ్ మరియు గ్యాస్ గన్‌ల వాడకంపై శిక్షణ. మాబ్ కంట్రోల్ (జనసమూహ నియంత్రణ), బందోబస్తు విధులు, విఐపి సెక్యూరిటీ మరియు ఎస్కార్ట్ విధులు. పికెట్ డ్యూటీలు, చెక్ పోస్ట్ నిర్వహణ మరియు రోప్ పార్టీ విధులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, ఏఆర్ డీఎస్పీ శ్రీ డి. ఏడుకొండల రెడ్డి గారు, ఆర్ఐలు వి.జె. రామకృష్ణ, యం. పెద్దయ్య, ఆర్ఎస్ఐలు మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :