నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబానికి ఆమె శ్రీరామరక్షగా నిలుస్తుందని డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు హితబోధ చేశారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో రైతు సాధికారిక సంస్థ ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, అమలు సామర్ధ్య పెంపుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణతో పాటు ప్రకృతి వ్యవసాయం, జీవన ఎరువులు, కషాయాలతో పండిన పంటలు ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. మహిళా సంఘాలు ఫుడ్ బాస్కెట్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో పెరటి తోటలు పెంపకం అలవర్చుకోవాలన్నారు. నేటి మానవ సమాజానికి ప్రకృతి వ్యవసాయ పంటలే ఆరోగ్యకరమని ప్రతి ఒక్కరు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఫుడ్ బాస్కెట్, కార్యాచరణ, అమలు, సామర్ధ్య పెంపుపై రైతు సాధికారిక సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సునీత, మండల కోఆర్డినేటర్ రుక్మిణి లు మహిళా సంఘ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘమిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News