Monday, 27 July 2026 12:11:27 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు

Date : 16 April 2026 05:25 PM Views : 303

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 16 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ, న్యూ ఢిల్లీ వారు 2025–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" (సార్వత్రిక మానవ విలువలు) కోసం నోడల్ సెంటర్‌గా గుర్తింపు లభించిందని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలియజేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విలువల ఆధారిత విద్యా విధానం, సమాజ సేవా దృక్పథం పెంపొందించడం వంటి అంశాల్లో మిట్స్ చూపుతున్న నిరంతర కృషిని గుర్తించి గౌరవ గుర్తింపు ధ్రువపత్రంను అందజేశారు. సార్వత్రిక మానవ విలువలను విద్యా వ్యవస్థలో సమన్వయం చేయడం, ఇతర విద్యాసంస్థలకు కూడా ఈ విలువలను విస్తరించడం, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. మిట్స్ యూనివర్సిటీ అందిస్తున్న విలువల ఆధారిత విద్య దేశ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మానవ విలువలను పెంపొందించే విద్యను మరింత బలోపేతం చేస్తామని, విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో మిట్స్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్. యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ యూ.హెచ్.వి సెల్ మెంబెర్స్ మరియు అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్,యూనివర్సిటీ యూ.హెచ్.వి సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి జగదీశ్ బాబు మరియు కో-కోఆర్డినేటర్ డాక్టర్ కే చంద్ర మోహన్ లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: