నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - డిసెంబర్ 03 : పి.టి.యం. ఎంపీపీ కార్యాలయం లోని భవిత కేంద్రం లో వికలాంగుల దినోత్సవం ను యం.ఈ.ఓ. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యం.ఈ.ఓ. నారాయణ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, వెసులుబాటులు, వారి కోసం ప్రత్యేక ప్రధాన్యత తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమం లో జె.ఏ.సి. నాయకులు సురేంద్ర, ఏ.యస్.ఐ. వరప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో యంగ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయగా, పాఠశాల కు ఫ్యాన్ ను వితరణ చేసిన ప్రసాద్. ఈ కార్యక్రమం లో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామ్మోహన్, హెడ్ మాస్టర్ సరళ దేవి, భవిత కేంద్రం టీచర్ అయేషా, ఉపాధ్యాయులు, పిల్లలు,విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News