Monday, 27 July 2026 01:52:24 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శ్రీవారి లడ్డూను కల్తీ చెసిన పాపం వైకాపా నాయకులదే - మై ఫోర్స్ మహేష్

Date : 04 February 2026 08:04 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 : దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం వైకాపా నాయకులదేనని జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డులో 58లక్షల లీటర్ల పామాయిల్, రెండు లక్షల లీటర్ల సింథటిక్ కెమికల్ (జంతువుల కొవ్వు) కలిపారని ఇక నెయ్యి లేదని తెలిపారు.1-16- 2024 లో ఒకసారి 23-7-2024లో మరోసారి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ 35 వపేజీలో లడ్డు ప్రసాదంలోజంతువుల కొవ్వు కలిసినట్లు ఉందన్నారు. లడ్డు ప్రసాదంలో చేసిన రిపోర్టులన్నీ సింథటిక్ కెమికల్స్ వాడినట్లు వచ్చాయని నేడు వైకాపా నాయకులు చేసిన పనికి సిగ్గుపడక ఆ నింద జనసేన, టిడిపి , బిజెపి నాయకుల పై మోపి శ్రీరంగనీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైకాపా నాయకులకు పుట్టగతులు ఉండవని హిందూ భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం అపవిత్రం చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన వైకాపా నాయకులు పార్టీ కావాలో శ్రీవారు కావాలో తేల్చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని దెబ్బతీయాలనే వైకాపా కపట నాటకాలు చెల్లవని హిందువుల మనోభావాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో వైకాపా కనుమరుగు కావడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె జనసేన నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో చేసిన కల్తీని వైకాపా నాయకులు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్, కూటమి పై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఉమేష్, రఘు, సురేష్, అరవింద్, రెడ్డప్ప, కార్తీక్, రెడ్డి ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :