నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 29 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యవర్గ సమావేశం ఎస్.బషీర్ ఖాన్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగినది. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.మహేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు.కృష్ణప్పలు పాల్గొని మాట్లాడుతూ; తంబళ్ళపల్లి నియోజకవర్గం విద్య, వైద్యం,పారిశ్రామిక రంగాలలో పర్యాటక రంగాల్లో వెనుకబాటుతనం, నిర్లక్ష్యం,నిరుద్యోగం గణనీయంగా పెరిగిందని, ఈ నియోజకవర్గంలోనే అభివృద్ధి అనేటువంటిది రెండు పార్టీల మధ్య కుమ్ములాటగా తయారైందని,తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి ఆమడ దూరంలో సామాన్య ప్రజానీకం పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు రైతులు కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ ప్రాంతంలో పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని,ఈ వలసల నివారణ కోసం, ఉపాధి కల్పన కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి,ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నియోజకవర్గంలోని తంబళ్ళపల్లె,మొలకలచెరువు,బి.కొత్తకోట మండలాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని, ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.తంబళ్లపల్లి నియోజకవర్గం అనునిత్యం కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నియోజకవర్గం అని, వర్షపాతం అతి తక్కువ ఉన్న ప్రాంతమని, రాష్ట్రంలోనే వెనకబడ్డ ప్రాంతంగా తంబళ్లపల్లి నియోజకవర్గం ఉన్నదని, ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు,విద్యాసంస్థలు, బి.కొత్తకోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆర్టీసీడిపో ఏర్పాటు చేయాలని, అలాగే మొలకలచెరువు మండలంలో ప్రభుత్వ స్వాధీనంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, తబళ్ళపల్లె,పెద్దమండెం మండలాలకు గిరిజనులకు ఉపాధి కల్పించడానికి డిఆర్ డిఏ,ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఉపాధి కల్పన కొరకు ఈ ప్రాంతంలో గిరిజన అభివృద్ధికి జనుపనార పరిశ్రమ,వేరుశనగ పరిశ్రమ నెలకొల్పాలని,బి. కొత్తకోట,కురబలకోట ప్రాంతాలలో టమోటా ఆధారిత పరిశ్రమ నెలకొల్పాలని,ఈ ప్రాంతంలో వేరుశనగ అత్యధికంగా సాగు అవుతున్నదని,వీటికి సంబంధించి ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పాలని,ఉపాధి కొరకు ఈ ప్రాంతం నుంచి వలసల నివారణ చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి కల్పన కొరకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని,తద్వారా రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు ఉపాధి కల్పన,ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరకు బి.కొత్తకోట, మొలకలచెరువు,తంబళ్ళ పల్లి ప్రభుత్వ పిహెచ్ సి ఆసుపత్రులలో మెరుగైన వసతులు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, మదనపల్లిలో ప్రభుత్వ స్వాధీనంలో మెడికల్ కళాశాలను నెలకొల్పాలని తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వైద్యవిద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా తమ ఆశలు నెలకొల్పడానికి ఆస్కారం ఉంటాదని వారు కొనియాడారు.ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు,భూ సమస్యల పరిష్కారం కొరకు,ఇండ్ల స్థలాల పరిష్కారం కొరకు, సాగుభూమి కొరకు,సాగు- తాగునీరు కొరకు రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యవర్గ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు కే.అంజనప్ప, జి.రఘునాథ్,ఎం.అషరష్ అలీ, పి.నారాయణస్వామి, నిజాముద్దీన్,హరి కుమార్,తంబయ్య శెట్టి, జవహార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News