నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ అధ్యక్షతన ధీమ్ 5లో రెండవ రోజు భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ మీద శిక్షణ కార్యక్రమంను పంచాయతీ కార్యదర్శులకు,కార్మికులకు ఏర్పాటు చేయడ మైనది. ఈకార్యక్రమంలో క్లీన్ అండ్ గ్రీన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు.ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబందించిన పంచాయతీ సెక్రటరీ లు,సచివాలయం సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు.థీమ్ 5 క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ముల్ భాగల్ రోడ్డులోని కురిజల సమీపంలో ఉన్న ఎస్ డబ్ల్యూ పి సి షెడ్ నందు అన్ని పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లతో శానిటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. షెడ్ నందు సెగరిగెషన్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ గురించి అవగాహన గ్రీన్ అంబాసి డర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రీన్ అంబాసిడర్లతో వారి యొక్క సమస్యలపై ఎంపిడిఓ, డిప్యూటీ ఎంపిడిఓ చర్చించడం జరిగింది.
Reporter
Namitha News