Monday, 27 July 2026 08:56:32 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాయలసీమ కోటాలో బలిజలకు ఎమ్మెల్సీ కేటాయించాలి - అంజన్ కుమార్

Date : 15 July 2026 11:01 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ స్థానాలలో రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని రాష్ట్ర కాపునాడు సంఘ ఉపాధ్యక్షుడు అంజన్ కుమార్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తంబళ్లపల్లెలో జరిగిన బలిజల ఆత్మీయ6 సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 33% పైగా బలిజ సామాజిక వర్గం బలంగా ఉండి అందుకు తగ్గట్టు రాజకీయంగా అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర తో పాటు రాయలసీమలో పలు నియోజకవర్గాలలో ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశామని నేడు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి దశా దిశా బలిజ సామాజిక వర్గానికి నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. అలాంటి బలిజలకు రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఈ విషయమై రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం ఒక్క తాటిపై నిలిచి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రాయలసీమ లో బలిజ సామాజిక వర్గం దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి తగిన న్యాయం జరగలేదని ఇప్పటికైనా కచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, బిజెపి మాధవ్, నారా లోకేష్ లను కోరుతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో బలిజ సామాజిక వర్గం ఐక్యతతో పాటు బలోపేతానికి ఈ నెల 26వ తేదీ బి కొత్తకోటలో జరిగే బలిజ ఆత్మీయ సమావేశానికి ప్రతి బలిజ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేకే కృష్ణమూర్తి, కాకర్ల కృష్ణమూర్తి, కసెట్టి వెంకటరమణ ,కుంచు మోహన్, కొటాల శివకుమార్, ధనుంజయ, జగదీష్, మోపూరి రెడ్డప్ప, రామచంద్ర, మధుసూదన్, మల్లికార్జున లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :