Monday, 27 July 2026 04:22:27 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 15 April 2026 11:00 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలోని చెత్త డంపింగ్ యార్డ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం తంబళ్లపల్లె కార్యదర్శి శ్రీనివాస్ రావు తంబళ్లపల్లె కు చెందిన చెత్తను పరుసతోపు వద్ద ప్రభుత్వ భూమిలో చెత్త డంపింగ్ చేయడానికి కొందరు అడ్డుపడుతున్నారని పంచాయతీ సిబ్బందితో తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన తాసిల్దార్ చెత్తడంపింగ్ కు ఎవరు అడ్డుపడ రాదని అలా అడ్డుపడితే చర్యలు చేపట్టాలని వీఆర్వో నాగరాజుకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన 2027లో భాగంగా స్వీయ నమోదు అందుబాటులోకి వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 16 నుండి 30 వరకు 15 రోజులు పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వీయ జనగణన కార్యక్రమం ద్వారా కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని ఈ అవగాహన కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి సహకరించాలన్నారు. ఆయన వెంట వీఆర్వో నాగరాజు, పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :