నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : * నెట్ బాల్ జాతీయ స్థాయికి ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ విద్యార్థిని* తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వేదిరేశ్వరం గ్రామం నందు 27/12/25 --28-12-25 తేదీలలో జరిగినటువంటి నెట్ బాల్ సీనియర్ మెన్ & ఉమెన్ అసోసియేషన్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లా పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా జట్టు నుంచి బాలికల విభాగం నందు విశ్వం స్కూల్ సీ.బీ.ఎస్.ఈ. మదనపల్లికి సంబంధించిన టి. తేజశ్రీ జాతీయస్థాయికి ఎంపికయి 11/1/26 - 14/1/26 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నందు జరిగినటువంటి నెట్ బాల్ ఆటలలో పాల్గొనడం జరిగింది. జాతీయస్థాయికి ఎంపికైన ఈ బాలికను విశ్వం విద్యాసంస్థల అధినేత ఎం. ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు.విశ్వం పాఠశాల ప్రిన్సిపల్ జే. రోజ్లిన్ ప్రియ గారు మరియు వైస్ ప్రిన్సిపల్ జీవన్ గారు ఎంపికైన బాలికను విజయం సాధించాలని ప్రోత్సాహం అందిస్తూ అభినందించడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి పిఈటి బృందాన్ని కూడా అభినందించడం జరిగింది
Reporter
Namitha News