నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : మదనపల్లె పట్టణంలో రోడ్డు ఆక్రమణలు హడావిడిగా తొలగించి ఎవరి మెప్పు పొందాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటికే విపరీతమైన వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి రోడ్లు వెడల్పు చేసి, ట్రాఫిక్ సిగ్నల్లు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చెయ్యడం ద్వారా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. మున్సిపల్, పోలీస్ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించకుండా, రోడ్డు ఆక్రమణలు ఎంత అయ్యాయో తేల్చకుండా హడావిడిగా జేసిబి తో రోడ్డు ఆక్రమణలు తొలగించు పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వలన విద్యార్థులు, రైతులు, కూలీలు, ఉద్యోగం, ఉపాధ్యాయులు, ఆసుపత్రులకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రోడ్లు అన్నీ ఆక్రమణలు పాల్పడ్డారని, రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా, వాళ్ళ బిల్డింగ్‌ల ముందు చిన్న తోపుడు బండ్లు, బంకులు పెట్టించి, వారి వద్ద వేల రూపాయలు బాడుగలు (అద్దెలు) వసూలు చేసుకునే వారికి మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా అధికారుల వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి రోడ్డు ఆక్రమణలు తొలగింపు పేరుతో హడావిడి తప్ప మరొకటి కాదని అన్నారు. పట్టణంలోని ప్రజలు, వాహనదారులు అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిపిఎం ఉద్యమం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ, అనిల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News