Sunday, 26 July 2026 10:48:45 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సర్వజన ఆసుపత్రి కి ఐడిబిఐ బ్యాంక్ వితరణ

రూ .2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ

Date : 08 January 2026 06:57 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం -- రూ.2.80 లక్షల విలువ గల ఫర్నీచర్ వితరణ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, ఐడిబిఐ బ్యాంక్ గురువారం భారీ సాయం అందించింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంకు మేనేజర్ వేలాయన్, ఫీల్డ్ ఆఫీసర్ నారాయణ, అముల్ కుమార్ తదితరులు సిఎస్ఆర్ నిధులతో రూ. 2.80 లక్షల విలువైన ఫర్నిచర్ ను ఆస్పత్రికి సాయంగా అందజేశారు. 10 వీల్ ఛైర్స్, 5 స్ట్రెచర్లు, 5 త్రీ సీటర్ బెంచ్ లు, 4 ఇన్వర్టర్ బ్యాటరీస్, 10 ఫాన్ లను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, ఆర్ఎంఓ షుకూర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐడిబీఐ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్ మాట్లాడుతూ పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో తమ‌వంతు బాధ్యతగా రోగులకు ఉపయోగకరంగా ఉండే ఫర్నీచర్ ను అందజేయడం జరిగిందన్నారు. వీటిని పేద రోగుల సౌకర్యం వినియోగించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంకు నిర్వాహకులు పెద్దమనసుతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు ఉపయోగపడే ఫర్నిచర్ వితరణ గా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో ఆస్పత్రిలో కొంత మేర పర్నీచర్ కొరత తీరిందన్నారు. పేదరోగులకు మెరుగైన‌ వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐడిబీఐ బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఫోటో రైటప్ ప్రభుత్వ ఆసుపత్రికి ఐడిబీఐ బ్యాంకు వితరణగా అందించిన ఫర్నీచర్

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: