Sunday, 26 July 2026 08:03:11 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం

Date : 13 April 2026 07:45 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 13 : మదనపల్లి సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేవలం విజయోత్సవ సభ మాత్రమే కాకుండా విద్యార్థి నాయకత్వాన్ని గుర్తించే వేడుక అని అన్నారు . ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ నాయకత్వం, ప్రతిభ మరియు సామర్థ్యాన్ని చాటిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఒక నాయకుడిగా నిలిచారని, ప్రతి సవాలును ఒక అవకాశంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రంగంలోనూ ఎదగాలని, ఐఐఎం బెంగళూరు, ఐఐటీ తిరుపతి వంటి సంస్థల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, ప్లేస్‌మెంట్ టీమ్‌లు, స్పోర్ట్స్ టీమ్‌లు వంటి కార్యకలాపాల్లో రెండవ సంవత్సరం నుంచే చురుకుగా పాల్గొనాలని సూచించారు. మిట్స్ యూనివర్సిటీ అవసరమైన సహకారం, వనరులు అందించేందుకు సిద్ధంగా ఉందని, విద్యార్థులు ముందుకు వచ్చి నాయకత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయకులేనని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వారి సహకారంతో అందరిని ఉత్సాహపరచడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. టీమ్ స్పిరిట్ అనేది ప్రతి విద్యార్థిలోనూ ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని ఆయన అన్నారు. అలాగే మిట్స్ యూనివర్సిటీ నందు మ్యూజిక్ మరియు డ్యాన్స్ తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటిస్తూ, ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్‌ను రిజిస్ట్రార్‌కు పంపాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ మార్చ్ 25 మరియు 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మొదటి రోజు రాకాస మూవీ టీం బృందం కొణెదల నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, గెటప్ శీను, సింగర్స్ సాగర్, మౌనిక యాదవ్, లిప్శిక భాష్యం మరియు రెండవ రోజున హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్, జబర్దస్త్ టీం సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్ నవ సందీప్ మరియు జబర్దస్త్ పులి లు పాల్గొని విద్యార్థులను అలరింపజేశారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రసంశ పత్రాలను మరియు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకనాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా, కో-కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, ప్రెసిడెంట్ హర్షవర్ధన్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయరాం రెడ్డి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: