నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ కంపెనీల అధిక లాభాల ఆశ, కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, పరీక్షల పేరుతో ల్యాబ్ సెంటర్ల భారీ దందా కలిసి ప్రజలను ఆర్థికంగా, శారీరకంగా దోచుకుంటున్నారని. అవసరం లేని టెస్టులు, అధిక ధరల మందులు, నకిలీ ఔషధాలు – ఇవన్నీ కలిసి సాధారణ కుటుంబాలపై తీవ్ర భారంగా మారాయని ఆరోపించారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని అరికట్టడంలో ఘోర వైఫల్యం చెందుతోంది. డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ బలహీనత, పర్యవేక్షణ లోపాలు, బాధ్యులపై కఠిన చర్యల లోపం. ఇవి మెడికల్ మాఫియాకు ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన యంత్రాంగం నిష్క్రియగా ఉండడం అత్యంత ఆందోళనకరం అన్నారు బోగస్ మరియు నాణ్యతలేని మందులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని కార్పొరేట్ ఆసుపత్రుల దందాపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ల్యాబ్ సెంటర్లలో టెస్టుల ధరల నియంత్రణ మరియు పారదర్శకతను తప్పనిసరి చేయాలని కోరారు అవసరమైన మందులను ప్రజలకు సరసమైన ధరలకు అందించే విధానాన్ని అమలు చేయాలని,ప్రజల ఆరోగ్యం వ్యాపార వస్తువుగా మారకూడదు. జీవించే హక్కు రాజ్యాంగబద్ధ హక్కు. ఆ హక్కును కాలరాయడానికి ఎవరికీ అనుమతి లేదు. మెడికల్ మాఫియాపై యుద్ధం – బోగస్ మందుల దందాకు ముగింపు పలకాలని కోరారు
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, జ్యోతి చిన్నయ్య,సిద్దిగాళ్ళ శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్,సీపీఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి మాధవ్,ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు హరి, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, దేవా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చంద్రశేఖర్,రవి,చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News