నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - మార్చి 22 : వేసవి కాలం ఆరంభం లోనే తాగునీటి కోసం అల్లాడుతున్న గ్రామస్థులు. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అడవికుంట పల్లి, ఎర్రజేనుపల్లె రెండు గ్రామాల ప్రజలు తాగు నీటి కోసం కొట్టుకుంటున్నా పంచాయతీ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోలేదని సమస్య పై సానుకూలంగా స్పందించి పరిస్కారం మార్గం చూపించకుండా మిన్నకుండటం పై విస్మయం తెలియచేస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రజేను పల్లి బాదితులను సిపిఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శనివారం ఎర్రజేనుపల్లి గ్రామస్థులను, అడవికుంటపల్లి జనం తాగునీటి పైపులు పగలగొట్టి కర్రలు, రాళ్లతో మూకూమ్మడిగా కొట్టడం తెలిసిందే. గాయపడ్డ బాదితులు మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందడం విధితమే. తాగు నీటి కోసం గొడవలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం సోచనీయ మన్నారు. ఘటన పై జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తామని తెలియచేసారు
Reporter
Namitha News