Sunday, 26 July 2026 10:48:00 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ క్వాలిటీ మైండ్ సెట్ అండ్ టెస్ట్ ఆటోమేషన్ అనే అంశంపై హాండ్స్ ఆన్ వర్క్ షాప్

Date : 30 December 2025 05:48 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 30 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏబీజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా (IEI) స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో క్వాలిటీ మైండ్ సెట్ అండ్ టెస్ట్ ఆటోమేషన్ అనే అంశంపై రెండు రోజుల పాటు హాండ్స్ ఆన్ వర్కుషాపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై కి చెందిన సి.జి.ఐ ఇన్ కార్పొరేషన్ కంపెనీ కన్సల్టింగ్ డెలివరీ మేనేజర్ వినోత్ కుమార్ బోజరాజ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి దశలో ముందుగానే నాణ్యతపై దృష్టి పెట్టాలని, డెవలపర్స్, టెస్టర్స్, బిజినెస్ అనలిస్ట్స్ అందరూ కలిసి పనిచేస్తే మంచి నాణ్యత గల ఫలితాలు వస్తాయని తెలిపారు. క్వాలిటీ మైండ్ సెట్ ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రారంభ దశ నుంచే నాణ్యతపై దృష్టి పెట్టడం, లోపాలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తెలుసుకోవడం ద్వారా వినియోగదారులకు నమ్మకమైన, సురక్షితమైన మరియు స్థిరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించవచ్చు. కేవలం చివరిదశలో టెస్టింగ్ చేయడం కాకుండా, ప్రతి డెవలప్మెంట్ దశలో నాణ్యతను కాపాడడం వల్ల సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అన్నారు. అలాగే టెస్ట్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ నాణ్యతను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ, ఆటోమేషన్ టూల్స్ సహాయంతో టెస్టింగ్‌ను వేగంగా, ఖచ్చితంగా నిర్వహించవచ్చు అని తెలిపారు. టెస్ట్ ఆటోమేషన్ ద్వారా మాన్యువల్ టెస్టింగ్‌ను ఆటోమేటిక్‌గా చేయడానికి ఉపయోగపడే టూల్స్, డేటా , కీవర్డ్ వంటి ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్స్ ను జావా, పైథాన్ వంటి సాధనాలకు అవసరమైన నైపుణ్యాలు, అలాగే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో ఏఐ యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ మరియు సమస్య పరిష్కరాలపై హాండ్స్ ఆన్ కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో ఉన్న కెరీర్ అవకాశాలు, క్వాలిటీ ఆటోమేషన్ ద్వారా విద్యార్థులు సాధించగల అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీన్ -స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్త, విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి, కోఆర్డినేటర్స్ కె.సెంథిల్ కుమార్, ఆర్. విజయగంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: