నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మంగళగిరి సి.కె.కన్వెన్షన్ లో డిప్యుటీ సియం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జరిగిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీ ని సంస్థగతం గా బలోపేతం చెందాలని రాష్ట్ర నేతలు సూచించినట్లు వెల్లడించిన స్థానిక జనసేన నాయకులు. ఈ కార్యక్రమం లో రాజంపేట పార్లమెంట్ సమన్వయ కర్త శివ శ్రీనివాస రావు, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శివరాం, ఇతర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News