నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 30 : ప్రతి విద్యార్థి విద్యలో ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయికి చేరి దేశ భవిష్యత్తుకు మణిహారంగా నిలవాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాధరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఆదర్శ పాఠశాలలో జరిగిన టెన్త్ విద్యార్థులు ఫేర్వెల్ డే లో పాల్గొని మాట్లాడుతూ టెన్త్ విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రగతి సోపానానికి నాంది పలకాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు క్రీడలు, క్రమశిక్షణ, పెద్దలపట్ల గౌరవం మీ భవిష్యత్తుకు కవచంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులకు అధ్యాపకులు, విద్యార్థులు ఫేర్వెల్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రసాద్, మారుతి కుమార్, స్కూల్ కమిటీ చైర్మన్ జయప్రద, వైస్ చైర్మన్ గులాం భాష, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, కాల నారాయణ, నరసింహులు, నరేంద్ర, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News