Monday, 27 July 2026 12:48:54 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం

కొండల మైనింగ్ పై ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం - జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్

Date : 11 June 2026 10:19 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో శతాబ్దాల క్రితమే మహా శివుడు నెలవై నేటికీ ఈ ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే పలికే ఆరాధ్య దైవంగా నిలిచాడు. ఇలాంటి లక్షలాది శివభక్తుల మనోభావాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ చర్యలను ఆపడానికి తన వంతు కృషి చేస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్య కొండలపై 2000 సంవత్సరం నుండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతితో మరుగున పడిందని అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి భూగర్భ గనుల శాఖ మంత్రి అరుణ కుమారి మైనింగ్ చేయడానికి ప్రయత్నించగా తంబళ్లపల్లె ప్రాంత శివ భక్తులు,ప్రజలు, పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు వ్యతిరేక లక్ష సంతకాల ఉద్యమాలు చేపట్టగా ప్రభుత్వం దిగివచ్చి ఐదు శాఖలతో విచారణ కమిటీ వేసినట్లు చెప్పారు. ఆ కమిటీ సభ్యులు సాదుకొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండల్లో సుదీర్ఘంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ మల్లయ్య కొండ మహాశివుడు సాదుకొండ వీరన్న గెవి నుండి ఇనుము కొండ మీదుగా మల్లయ్య కొండల్లో స్థిరపడిన శతాబ్దాల చరిత్ర ఆనవాళ్లు ప్రత్యక్షంగా చూసి కమిటీ సభ్యులు మహాశివుని మహిమలను గుర్తించి కొండల జోలికి వెళ్లరాదని ఇచ్చిన సమగ్ర నివేదికతో కనువిప్పు కలిగి మైనింగ్ చర్యలు పై ప్రభుత్వం తప్పుకున్నట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు తంబళ్లపల్లె నియోజకవర్గం తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది మహా శివుని భక్తులు ఆయన సేవకు విరాళాలు ప్రకటించి మల్లయ్య కొండలు దినదినాభివృద్ధికి కృషి చేస్తున్నారని అలాంటి మహాన్విత కొండలను మైనింగ్ చేపడితే దైవత్వంతో పాటు పచ్చటి పర్యావరణం, లక్షలాది జీవరాసులు, వన్యప్రాణులు, ఆశ్రయం కోల్పోయి మానవ మనుగడ కష్టతరమవుతుందని మల్లయ్య కొండల్లో మైనింగ్ పై ఈ ప్రాంత చిన్న పిల్లవాడిని కదిలించిన తీవ్ర వ్యతిరేకత వస్తుందని లక్షలాది భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవునిపై రాజకీయాలు చేయకుండా మల్లయ్య కొండ శివుడు మన అందరి ఆరాధ్య దైవంగా మల్లయ్య కొండల్లో మైనింగ్ సమస్య పరిష్కారానికి శివ భక్తులు, ప్రజల మనోభావాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పార్టీలకతీతంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :