నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 08 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కి జాతీయ స్థాయిలో డిజిటల్ స్కీల్లింగ్ ఎక్స్లెన్స్ అవార్డు లభించినట్లు ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. న్యూ ఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ ఈ అవార్డు అందుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ డిజిటల్ భారత్ టాలెంట్ కాన్క్లేవ్–2026 కార్యక్రమంలో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు ను అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డు అందజేసిన నాస్కామ్ సంస్థకు మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Namitha News