నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 'ఉపాధి’ ని కాపాడుకుందాం -- సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను నిరసించాలని, కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు కోరారు. ఇంటింటికీ ప్రచార కార్యక్రమం సందర్బంగా ఇళ్ల వద్దకెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మదనపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజి ఆర్‌ఎఎం జి చట్టం తీసుకు రావడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని కార్మికులకు పనులు లభించక వలసలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమక్రమంగా పనులను తగ్గిస్తూ, కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నూతన ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలపై భారం పడి క్రమంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటాయని తెలిపారు. విబిజి ఆర్‌ఎఎంజి పథకాన్ని రద్దు చేసి తక్షణం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పునరుద్దరించాలంటున్న కూలీలు
Reporter
Namitha News