నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 21 : ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన A1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన స్థానిక తెలుగుదేశం నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పక్కన పట్టణవాసి పఠాన్. ఆజ్గర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ (A1) వెహికల్ మరియు వాటర్ సర్వీసింగ్ పాయింట్ ను నేడు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మండల ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు గొట్టిగుండాల బుజ్జిరెడ్డి, వెంకటయ్య, పిడికిటి వెంకటేశ్వర్లు,సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జర్నలిస్టులు చిట్టమూరు.సుబ్బారెడ్డి, దీపోగు.బాబు, ఖాసీం, బాదుల్లా, మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా తాము నూతనంగా ఏర్పాటుచేసిన ఈ వాటర్ సర్వీసింగ్ పాయింట్ ప్రాణభానికి విచ్చేసిన తమ ఆత్మీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తమ షాపు లో స్కూటర్లు, కార్లు ఇతర వాహనాలను అధునూతన పద్ధతిలో వాటర్ సర్వీసింగ్ చేసి వాహనాలను అందంగా సిద్ధం చేస్తామని వీటితోపాటు స్కూటర్ రిపేర్లు, పంచర్లు, బైక్ పాలిషింగ్, స్టిక్కరింగ్ తదితర సర్వీసులను చేస్తామని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు పటాన్. అజ్గర్ తెలిపారు
Reporter
Namitha News